Supreme Court: దేశంలో వందేమాతరం గేయంలోని ఆరు చరణాలను పాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు చరణాలే పాడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ఎస్. మురళీధర్ మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. వందేమాతరంపై సరైన చర్చ, ప్రజాభిప్రాయం లేకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని మురళీధర్ వాదించగా, చట్టాల రూపకల్పన రాజ్యాంగ ప్రకారమే జరుగుతుందని మెహతా అన్నారు. ఈ సందర్భంగా మెహతా చేసిన ‘నక్సలైట్’ వ్యాఖ్యపై మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ జయమల్య బాగ్చి జోక్యం చేసుకుని వాదనలు అనవసర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జోక్యం చేసుకుని వ్యక్తిగత వ్యాఖ్యలను పక్కనపెట్టి, కోర్టు ముందున్న రాజ్యాంగపరమైన అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలని న్యాయవాదులను కోరారు. మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే జోక్యం చేసుకుని స్వతంత్రంగా ఆలోచించడం నక్సలైట్ కావడం కాదని అన్నారు. ఒకరిని నక్సలైట్‌గా పేర్కొన్నా వారి రాజ్యాంగ హక్కులు కోల్పోరని జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు. చివరగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణలో జరిగిన వ్యాఖ్యలను రికార్డులోకి తీసుకోకుండా, పిటిషన్‌లోని రాజ్యాంగపరమైన అంశాలపైనే తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం