Supriya Sule Delimitation Bill: ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈసారి డీఎంకే ఇండియా కూటమి నుంచి దూరమైన నేపథ్యంలో బిల్లుకు మద్దతు లభించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూడా బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చన్న ప్రచారం మధ్య, పార్టీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ అంశంపై తమ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, బిల్లు పార్లమెంట్‌లో వచ్చిన తర్వాత పూర్తిగా అధ్యయనం చేసి, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో చర్చించిన తర్వాతే అధికారిక వైఖరిని ప్రకటిస్తామని తెలిపారు.
జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని సుప్రియా సూలే అన్నారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచేలా బిల్లు ఉంటేనే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే ఇండియా కూటమి ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) ఎన్‌డీఏకు దగ్గరవుతోందన్న ప్రచారాన్ని శరద్ పవార్ వర్గం, అధికార మహాయుతి కూటమి రెండూ ఖండించాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
డీలిమిటేషన్ బిల్లుపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు