Tvk Mla Alleges Rs 35 Crore Bribe: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ కుట్రను పోలీసులు బయటపెట్టారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర వెనుక డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాకు అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఫోన్ ద్వారా ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే నిరాకరించడంతో ఆయనను, కుటుంబాన్ని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్‌లను అరెస్ట్ చేశారు. విచారణలో సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్‌తో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా, ఈ కుట్రపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!