టీడీపీ సీనియర్ నేతగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సేవలను కొనియాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి భాష ఉపయోగపడుతుందని, ఇతరులను దూషించడానికి కాదని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని, చర్చలు జరగాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తుచేసుకున్న పవన్ కళ్యాణ్ ఇంటి గౌరవాన్ని కాపాడుకోవాలని, పొట్టి శ్రీరాములు ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నారు.