Andhra Pradesh Job Calendar

Andhra Pradesh Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించి నియామకాల ప్రక్రియపై సమీక్షించారు. భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈ-హెచ్‌ఆర్‌ఎం ప్రక్రియ పూర్తి చేయడం, స్థానిక కేడర్ విధానం ప్రకారం నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. అలాగే కొత్త స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాలు, రోస్టర్లు, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపడం వంటి విషయాలను కూడా పరిశీలించారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ఎస్‌. రావత్‌, బి. రాజశేఖర్‌, కృష్ణబాబు, జి. జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండో దశ జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది మార్చి 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి తొలి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగను తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు రెండో దశ జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్‌.. సీఎస్‌ కీలక సమావేశం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *