News5am, Breaking Headlines Telugu Latest (09-06-2025): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 10:20 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. ఆయన అక్కడ ఏఐసీసీ నేతలతో సమావేశమై రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, పార్టీ కార్యవర్గ విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల మంత్రిగా నియమితులైన ముగ్గురు నేతలకు శాఖల కేటాయింపు జరగనుండగా, దీనిపై అధికారిక ప్రకటన సోమవారం లేదా మంగళవారంలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దే ఉన్న విద్య, హోం, పురపాలక, మైనార్టీ సంక్షేమం, పశుసంవర్థక, న్యాయ, క్రీడలు వంటి శాఖలు కొత్త మంత్రులకు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖలు ఇవ్వనున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించేందుకు యోచిస్తోంది. ఈ సభల తేదీలపై కూడా సీఎం ఢిల్లీలో చర్చించనున్నట్టు సమాచారం.
More Political News Telugu:
Breaking Headlines Telugu Latest
రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు
రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..
More Breaking News Telugu: External Sources
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి