Breaking News Telugu

News5am, Breaking News Telugu (14-06-2025): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, కేటీఆర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారిస్తున్న సమయంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని బాల్మూరి వెంకట్ అన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సాక్ష్యాలు పరిశీలించి, కేటీఆర్‌పై భారతీయ శిక్షా సమితి (బీఎన్ఎస్) సెక్షన్ 353(2) మరియు సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు.

More Breaking News:

Today News Telugu:

మచిలీపట్నంలో వైసీపీ నేతలతో పేర్నినాని అత్యవసర సమావేశం..

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్..

More Breaking News Telugu: External Sources

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *