News5am, Breaking News Telugu (03-06-2025): తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నుంచి భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో, తహశీల్దార్ నేతృత్వంలో బృందాలు రెవెన్యూ గ్రామాలకు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మండలాల వారీగా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్‌ను రూపొందించి, గ్రామాల్లో ఎప్పుడు సదస్సులు జరుగుతాయో ప్రజలకు తెలియజేస్తున్నారు.
భూ భారతి చట్టం ద్వారా ధరణిలో పరిష్కారం కాలేని సాదా బైనామా, మిస్సింగ్ సర్వే నంబర్లు, రైతుల వివరాల్లో లోపాలు, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్, అసైన్డ్ టు పట్టా క్లాసిఫికేషన్ మార్పు, ప్రొహిబిటెడ్ జాబితాలో మార్పులు, వారసత్వ హక్కులు, పెండింగ్ మ్యుటేషన్‌లు, భూసేకరణ సమస్యలు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం తీసుకొచ్చారు. భూ సమస్యలపై మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని, రైతులకు సహాయపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More Breaking News Telugu Political:
News Telugu:
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం..
బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..
More Breaking News Telugu: External Sources
నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు