Breaking News Telugu

News5am, Breaking News Telugu (03-06-2025): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూన్ 2 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూ భారతి చట్టాన్ని చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. భూ సంస్కరణల తొలి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందనీ, రెండో చట్టం కూడా అదే పార్టీ చేసినదని తెలిపారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టంతోనే భూ సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే, బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇబ్బందులు తెచ్చాయని పేర్కొన్నారు.

ధరణిలో సవరణలు చేసుకునే అవకాశం లేకుండా చేసిన చట్టాన్ని తీవ్రంగా విమర్శించారు. ధరణికి తాళం వేసి భూములు కబ్జా చేసి అక్రమాలకు పాల్పడే పరిస్థితిని అప్పటి నేతలు సృష్టించారని అన్నారు. బూర్గుల రామకృష్ణ రావు గురించి చెప్పుకున్నట్లే, పొంగులేటి గురించి కూడా అలాగే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో భూములకు పన్నులు చెల్లించేవాళ్లమని, జమాబంది ఉండటం వల్ల భూ వివాదాలు తలెత్తకుండా ఉండేదని గుర్తు చేశారు. అసైన్‌మెంట్ కమిటీలు లేకపోవడం వల్ల కూడా నష్టం జరిగిందని భట్టి వెల్లడించారు.

More Breaking News Telugu Buzz:

Updated Breaking News Telugu:

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం..

బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

More News Telugu: External Sources

కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *