News5am, Breaking Telugu | News Latest (28-05-2025): సిర్పూర్‌లో రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడి హట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను కోనప్ప స్వీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు తుమ్మడి హట్టి వద్ద చర్చ జరగనుండగా, ఇద్దరు నేతలు, వారి అనుచరులు చర్చకు సిద్ధమయ్యారు. అయితే, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. మరోవైపు, కోనప్పతో పాటు అతని అనుచరులను కూడా పోలీసులు నిలువరించారు.
నీటి ప్రాజెక్టును సిద్ధిపేటకు తరలిస్తున్నప్పుడు కోనప్ప మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే హరీష్ బాబు ఆరోపించారు. కోనప్ప వల్లే సిర్పూర్‌కు అన్యాయం జరిగిందని ఆరోపణ చేశారు. తుమ్మడి హట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుకు మార్చినా ఆయన స్పందించలేదన్నారు. గతంలో తుమ్మడి హట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే హరీష్ బాబు తల్లి ధర్నా చేసినట్లు కోనప్ప విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. బహిరంగ చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో, పోలీసులు ఇద్దరు నేతలను అడ్డుకోవడంతో చర్చ నిలిచిపోయింది. ప్రస్తుతం కోనప్ప నివాసం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
More Breaking Political Latest News:
Breaking Telugu | News Latest
అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్..
కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
More Breaking Telugu Latest News: External Sources
నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఎమ్మెల్యే హరీష్ బాబును అడ్డుకున్న పోలీసులు!