News5am,Breaking Telugu New (09-05-2025): 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు ఇక ముగింపు పలికింది. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరంలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ ప్రజలకు ఇది పండుగ దినం అని అన్నారు. పేదల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుండేదనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.
“భగత్ సింగ్ కాలనీ వాసులకి ఇది ఆనంద దినోత్సవం. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇళ్ల పట్టాల విషయంలో చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశాయి. గత ప్రభుత్వం నకిలీ పట్టాలు ఇచ్చి పేదలను మోసగించింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల 1400 పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం లభించింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని దీనితో మరోసారి రుజువైంది” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
More Breaking Telugu News
నూతన పోప్గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్…
భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు..
More Breaking Telugu New: External Sources
Permanent House: పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!