Breaking Telugu News

News5am, Breaking Telugu News111 (09-06-2025): జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు వాత్సల్యనాథ్‌, అక్షర నాగ, దిశిర ఉన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్‌ నాయకులు, అనుచరులు, మిత్రులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయాన్ని మాదాపూర్‌లోని వసంత హైట్స్‌లోని ఇంటికి తరలించారు.

ఆయనకు చివరి వీడ్కోలు పలకేందుకు నేతలు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, సినీనటుడు మాగంటి మురళీమోహన్‌, ఏపీ మంత్రి లోకేశ్‌, నారా బ్రాహ్మణి మరియు ఇతర పార్టీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. మాదాపూర్‌ నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, ఆయన కుమారుడు వాత్సల్యనాథ్‌ చితికి నిప్పంటించారు.

More Telugu News:

Breaking Telugu News111:

రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు

రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..

More Breaking Telugu News: External Sources

మాగంటికి కన్నీటి వీడ్కోలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *