ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైడ్రా చట్టం ద్వారా ఆర్డినెన్స్‌ను తీసుకురావడం?, మూడు విశ్వవిద్యాలయాల పేర్లను ఖరారు చేయడం, భారీ వర్షాలు-వరదలతో నష్టం, రేషన్ కార్డులు, హెల్త్‌కార్డుల జారీ?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ట్రిపుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ ఎల్ బీసీ పనులు- నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలపై చర్చలు జరగనున్నాయి.
వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10,300 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర సాయం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సాయం అందే అంశంపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు కొత్త పేర్లను పెట్టేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించనుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, కోఠి మహిళా విశ్వవిద్యాలయం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి, హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ టెక్నాలజీకి కొత్త పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.