పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీ చేస్తున్నారు. జేజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్జీత్ దాండా తిరిగి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి యోగేశ్ బైరాగి బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, హర్యానా స్పోర్ట్స్ సెల్ కో-కన్వీనర్‌గా ఉన్నారు. జులానా నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది
అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 21 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించింది. 90 నియోజకవర్గాలకు గాను రెండు జాబితాలతో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అంతకుముందే, 67 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.