తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిన్తున్నారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి అనేక పెట్టుబడులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీకి పయనమయ్యారు. ఈరోజు ఢిల్లీలో ఫాక్స్‌కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం వారితో చర్చలు జరపనున్నారు..
మరోవైపు తెలంగాణలో పార్టీ విషయాలపై చర్చించేందుకు హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రి వర్గ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని, వరంగల్ లో నిర్వహించే రైతు కృతజ్ఞత బహిరంగ సభకుసభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. తిరిగి శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు.