తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీనియర్ అబ్జర్వర్లుగా నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సైతం కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఝార్ఖండ్ కు ఆయనను సీనియర్ అబ్జర్వర్ గా నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజే షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు, కో ఆర్డినేటర్లను నియమించింది.
.