తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. గత వైసీపీ సర్కారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారని బుధవారం సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలను తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని కామెంట్స్ చేశారు.

దీంతో లడ్డూ తయారీ విషయం చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మరోసారి స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ విషయంలో విచారణ జరుగుతోందని బాధ్యులని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసారు. ఇప్పుడు ఇవన్నీ సరి చేశాం. నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ లడ్డు వివాదంపై స్పందించారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందనన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. బాధ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *