బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులు కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఈ చేరికలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగాయి. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లికి అత్యంత సమీపంగా ఉన్న సోమేశ్వర రావుతో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారికి గౌరవంగా ఆహ్వానం పలికారు మహేశ్ కుమార్ గౌడ్. పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి కూడా ఈ చేరికల వేడుకలో పాల్గొన్నారు.