ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఈ నాలుగు పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24 వరకు గ్రామసభలు, వార్డు సభలు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో ప్రజలకు ప్రభుత్వ ఆశయాలు, పథకాల వివరాలు చెప్పి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు ప్రారంభం కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారుల సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలను నిర్వహించనున్నారు.