ఆర్టీసీ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కార్మిక సంఘం పునరుద్ధరణ, పీఆర్సీ బకాయిలు, ఆర్టీసీలో ఖాళీల గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. కార్మికుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి? సాంబశివరావుకు మైక్ ఇవ్వడంలో తప్పేముంది? ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు బీఆర్‌ఎస్ నేతలకు సోయి లేదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రభుత్వంలో విలీనం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు.. స్పీకర్ పై నిందలు వేయడం తగదన్నారు. కార్మిక సంఘాలను రద్దు చేసింది బీఆర్ఎస్ అని అన్నారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, బీఆర్ఎస్ కార్మిక సంఘాలు దీక్షలు చేసినప్పుడు వారి పట్ల వివక్ష చూపిందన్నారు. ఆ రోజు ఆర్టీసీ గౌరవ అద్యక్షుడు హరీష్ రావేనని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *