రాజకీయాలు, దేశ భద్రత వేరు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దామగుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ కృషిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండలో ఏర్పాటు చేయనున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేవీ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్ కు మంచి గుర్తింపు ఉందన్నారు.

కమ్యూనికేషన్ విషయంలో దామగుండం రాడార్ స్టేషన్‎ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. దేశ రక్షణలో వీఎల్ఎఫ్ స్టేషన్‏తో అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కమ్యూనికేషన్ విషయంలో భవిష్యత్ దిశగా అడుగులు వేయాలని, సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్ అనేక రకాలుగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం జయంతి నాడు నేవీ రాడార్ స్టేషన్‎కు హైదరాబాద్‎లో భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉందని, దానిని మరింత స్ట్రాంగ్‎గా చేసుకోవడం అనివార్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *