Introduce 8 Bills in Lok sabha: జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ముఖ్యమైన పరిణామాల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ అంశాలను లేవనెత్తేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలు కోరినా కేంద్రం తిరస్కరించింది. బీహార్ ఎన్నికల నేరుగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మీద కూడా కాంగ్రెస్ సభలో ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆదాయపు పన్ను, క్రీడా పాలన, భూ వారసత్వం వంటి కీలక విషయాలపై మొత్తం ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ సమావేశాల్లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు అంశంపై ఉభయ సభల ఆమోదం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను సవరణ బిల్లులు కూడా ఈ సారి లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముందుగా ఈ సమావేశాలను ఆగస్టు 12 వరకు నిర్వహించాలని అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆగస్టు 21 వరకు పొడిగించారు. అధికార, ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.
Internal Links:
మాజీ సీఎం కేసీఆర్తో హరీష్ రావు కీలక భేటీ..
External Links:
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 8 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్