Kavitha Letter To Cm Revanth Reddy: జాగృతి అధినేత్రి కవిత, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ జీవో నం.317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వన్‌టైమ్ రిలీఫ్ ఇవ్వాలని కోరారు. 2021లో జారీ చేసిన ఈ జీవో కారణంగా వేలాది మంది తమ స్వస్థలాలకు దూరంగా పని చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా తమ సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు కూడా ఇదే విషయంపై హామీ ఇచ్చారని, ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిపై స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన శాంతి కుమారి సబ్ కమిటీ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టకపోవడంపై కూడా ప్రశ్నించారు.
జీవో 317 సమస్యకు పరిష్కారం పేరుతో తీసుకొచ్చిన ఇతర జీవోలు కూడా ప్రయోజనం ఇవ్వలేదని, ఇప్పటికీ వేలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులు తమ స్వస్థలాలకు బదిలీ కావాలని కోరుతున్నా స్పందన లేదని విమర్శించారు. వెంటనే సబ్ కమిటీ నివేదికను విడుదల చేసి, బాధితులకు వారి జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగుల ఖాళీలను ఉపయోగించి, నిరుద్యోగులకు నష్టం లేకుండా జీవో 317 బాధితులకు అవకాశం కల్పించాలని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
సీఎం రేవంత్‌రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్‌కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!