తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎంపీ ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, వాయనాడ్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారి ఎన్నికల బరిలో నిలవడంతో ఆమె గెలుపుపై ​​హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఫలితంగా, బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూనే వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరోవైపు, గాంధీ కుటుంబాన్ని ఓడించి వయనాడ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బీజేపీ, సంఘ్‌ శ్రేణులు వయనాడ్‌లో ఆపరేషన్‌ స్టార్ట్ చేశారు. స్థానికంగా మంచి పేరున్న, విద్యావంతురాలైన నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ ఎన్నికల బరిలోకి దింపింది. ప్రియాంక గాంధీ స్థానికేతరురాలు అనే ప్రచారం చేస్తూ, స్థానిక సెంటిమెంట్‌ను రగిలించాలని బీజేపీ యత్నిస్తున్నట్టు పలువురు రాజకీయ విమర్శకులు వెల్లడిస్తున్నారు. కాగా, వామపక్ష పార్టీలకు కంచుకోట కేరళ. అక్కడ అధికార పార్టీ కూడా వామపక్షాలదే. అందుకే, ఈ సారి ఎలాగైన వయనాడ్‌ను సొంతం చేసుకోవాలని ఎల్‌డీఎఫ్‌ సైతం పట్టుదలగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *