ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని వెల్లడించారు. మంగళవారం ఖమ్మం రూరల్ కస్నాతండా, వాల్యాతండాలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయబాబుతో కలిసి ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాల్యాతండా వద్ద వంతెన, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన వస్తువులు అందజేశారు.
మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వైరా మున్సిపాలిటీలో వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పంపిణీ చేశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో అలర్ట్గా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు.