భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ పై ఇటీవలే పోలీసు కేసు నమోదైంది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రామారావుతో పాటు పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. జూలై 26న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధులు అనుమతి లేకుండా డ్రోన్ తో మేడిగడ్డ బ్యారేజ్ విజువల్స్ చిత్రకరించారు. ఆ తరువాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాలి షేక్ ఫిర్యాదు మేరకు కేటీర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
తెలంగాణ ప్రభుత్వానికి మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో, అనధికార డ్రోన్ ఆపరేషన్ ప్రజా భద్రతకు ఎంత ప్రమాదకరమో వలి షేక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వినియోగదారులు డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసిన తర్వాత, సమస్య గురించి అధికారులకు తెలియజేశారు. జులై 29 న వాలి షేక్ మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా. తాజాగా ఇందుకు సంబందించిన ఎఫ్‌ఐఆర్ వెలుగూలోకి వచ్చింది.