News5am, Latest News Telugu (09-06-2025): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ముగ్గురు కొత్త సభ్యులకు కేబినెట్‌లో స్థానం కల్పించనున్నారు. ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుతూ ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల వర్గానికి చెందిన వివేక్, ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. అలాగే శాసనసభ ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) పదవికి రామచంద్రునాయక్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లతో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించిన చర్చల అనంతరం తీసుకున్నట్లు సమాచారం. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించి విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేశారు.
More Latest News:
Latest News Telugu:
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..