Latest Telugu News

News5am, Latest Telugu News (13-06-2025): మచిలీపట్నంలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యవసరంగా సమావేశమై, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశిస్తూ ఆయన తాను ఎలాంటి కేసు అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని, “ఐ యామ్ వెయిటింగ్” అంటూ ఘాటుగా స్పందించారు. తనపై, తన భార్యపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. రాజకీయ వేధింపులకు తాను భయపడనని, పారిపోవాల్సిన అవసరం లేదని, బందరులోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే రేషన్ బియ్యం కేసుపై మాట్లాడుతూ తాను ఎప్పుడూ అవినీతి చేయలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నాని, తమ కార్యకర్తల ఇళ్లలో టపాసులు కాల్చడం, పూల కుండీలు బద్దలు కొట్టడం లాంటి వేధింపులను వివరించారు.

ఇక ఇళ్ల పట్టాలపై మాట్లాడుతూ, బందరులో 19,410 మందికి ఆన్‌లైన్ ఆధారంగా పట్టాలు ఇచ్చామని, వాటికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అయితే కొల్లు రవీంద్ర ఇచ్చిన పట్టాలకు ఆధారాలే లేవని ఆరోపించారు. పోర్ట్ అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు లాక్కోవడం, చేపల మార్కెట్ నుంచి ఇసుక వరకూ అన్ని రంగాల్లో ఆయన అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ నేతల మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, పేర్ని నాని ఇక వెనుక ఉండకూడదని భావించి కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలు ప్రస్తుతం పార్టీ క్యాడర్‌లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలు చూసి రాజకీయంగా మౌనం వహిస్తారని అనుకున్నా, ఆయన తీరుగా స్పందించి ప్రత్యర్థులకు టెన్షన్ పెంచుతున్నారని చర్చ సాగుతోంది.

More Latest Telugu News:

Latest Telugu News:

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్..

నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్‌..

More Latest Telugu News: External Sources

మచిలీపట్నంలో మరోసారి పొలిటికల్ హీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *