Telugu Latest News All

News5am Telugu Latest News (01/05/2025) : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కుల గణనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు స్పందన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, “రేవంత్ డీఎన్ఏలో అసలు కాంగ్రెస్‌ పార్టీ విలువలు లేవు” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కుల గణనకు ఎప్పటి నుంచో వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు ఓబీసీపై మొసలి కన్నీరు కారిస్తుంటే, వాస్తవానికి వారి ఉద్దేశం ఓట్లు గెలవడమేనని ఆరోపించారు. తెలంగాణలో తీసుకున్న కుల గణన సర్వేను అసలు ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో ఉంచలేదని ప్రశ్నించారు. నిజమైన పారదర్శకత ఉంటే, ప్రజలతో వివరాలు షేర్ చేయడంలో భయం ఎందుకన్నారు.

కేంద్ర ప్రభుత్వం మాత్రం కుల గణనను ఓ కంటితుడుపు చర్యగా కాక, సమాజ అభివృద్ధి లక్ష్యంగా తీసుకుంటోందని పేర్కొన్నారు. జనగణనతో పాటు కుల గణనకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీకి లక్ష్మణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్య వల్ల బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పునాది పడుతుందని అభిప్రాయపడ్డారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలతో చేసిన సర్వే వివరాలను ఇప్పటికీ బయటపెట్టలేదని, ఆ పేరుతో రూ.5000 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. కుల గణనను శాస్త్రీయంగా, బాధ్యతతో మోదీ చేపడుతున్నారని పేర్కొన్నారు.

Latest Telugu News

Latest More News

హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్..

వార్ 2 టీజర్ విడుదల..

More Telugu News : External Sources

కుల గణనపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *