Patna: బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. అయితే, దుర్భంగా పట్టణంలో జరిగిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. బీజేపీతో పాటు నితీష్ కుమార్, అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వంటి నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు.
పాట్నాలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించగా, ఇరు వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాల కార్యకర్తలు తీవ్రంగా కొట్టుకున్నారు, పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. మోడీ, ఆయన తల్లిపై దూషణలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.
Internal Links:
వరదలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష..
ఒబెరాయ్ హోటల్ కు అలిపిరిలో భూములు..
External Links:
పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు