భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ మరియు డిఓజే అధిపతి ఎలోన్ మ‌స్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు. మస్క్ తో అనేక అంశాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డి.సి.లో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య తలెత్తిన అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో పరస్పర సహకారంపై చర్చించినట్లు మోదీ తెలిపారు. ఈ రంగాలలో భారతదేశం-అమెరికా భాగస్వామ్యం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *