Rajagopal Reddy Questions Cm Revanth Reddy

Rajagopal Reddy Questions Cm Revanth Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి రోడ్లకు, భవనాలకు ఒక్క రూపాయి నిధులు కూడా రాలేదని, కనీసం కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించలేదని విమర్శించారు. తాను మంత్రి పదవి పొందకపోయినా, మునుగోడు అభివృద్ధికి కావాల్సిన నిధులు మాత్రం ఇవ్వాలని ఆయన కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పదవులు తమవే కానీ నిధులు కూడా తమవేనా అని సీఎం రేవంత్‌ను నేరుగా ప్రశ్నించారు. 20 నెలలుగా మునుగోడులో పనులు ఆగిపోయాయని, తన నియోజకవర్గ అభివృద్ధికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పదవిపై నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానమే తీసుకుంటుందని, తాను పదవికి కంటే మునుగోడు ప్రజలకు ప్రాధాన్యత ఇస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పదవి వస్తే అది మునుగోడు ప్రజలకే న్యాయం అవుతుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నేతలను ఎన్నుకోవాలని, వారితో కలిసి తన నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చేలా పోరాడతానని తెలిపారు. ఇటీవలి కాలంలో తనకు హామీ ఇచ్చిన మంత్రి పదవి ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తన సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Internal Links:

పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది..

బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్..

External Links:

పదవులు, పైసలూ మీకేనా.. సీఎంను ప్రశ్నించిన మునుగోడు ఎమ్మెల్యే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *