తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై స్కిల్ యూనివర్సిటీపై చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రొఫెసర్ కోదండరామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదాపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం అధికారులు ముసాయిదా సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముసాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కోర్సుల పరంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై కూడా కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించి, ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మార్పులు, చేర్పులతో పూర్తి ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *