తెలంగాణ శాసనసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. రోడ్డు నిర్మాణ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు నిర్మించామని హరీష్ రావు అన్నారు.
దాంతో మధ్యలో కలుగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. అంతే, స్పీకర్ కౌంటర్‌కు సభలోని సభ్యులందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేయగా, పాత మండలాల ప్రకారం అన్ని మండలాల్లో రోడ్లు వేశామని హరీశ్‌రావు వివరించారు.