శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో సహాయక చర్యల ప్రారంభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షలో NDRF, ఆర్మీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, NGRI, సింగరేణి, మరియు అనేక ఇతర విభాగాల అధికారులు పాల్గొంటారు. ఈ ప్రమాదం సరిగ్గా నెల రోజుల క్రితం SLBC సొరంగంలో జరిగింది. 8 మంది చిక్కుకున్నారు. అప్పటి నుండి, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. గురుప్రీత్ సింగ్ (పంజాబ్) మృతదేహాన్ని మాత్రమే సహాయక బృందాలు వెలికితీశాయి.

కాగా, ఇప్పటి వరకు మరో ఏడుగురి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే, నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో, పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా, టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *