తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ఆర్టీసీ బస్సులో మహిళల బస్సు ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు మహిళా కమిషన్ ,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా శనివారం కేటీఆర్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ హాజరుపై మహిళా కమిషన్ ప్రకటన విడుదల చేసింది. తాము జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించి తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని ప్రకటనలో పేర్కొంది. తన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారని, అధికారికంగా క్షమాపణలు చెప్పారని తెలిపింది. కేటీఆర్ క్షమాపణలను మహిళా కమిషన్ అంగీకరించిందని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ తెలిపింది. ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *