ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా కవిత బెయిల్‌కు అర్హురాలని కవిత తరఫున వాదనలు వినిపించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. వీరితో పాటు 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో ఆమె సుమారు 6 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *