Telangana Local Body Elections

Telangana Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు సాగింది. చివరి నిమిషాల్లో క్యూలో ఉన్న ప్రతి ఓటరికి ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా 3,752 సర్పంచ్ స్థానాలు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా, కొన్ని కేంద్రాల్లో స్వల్పంగా ఓటింగ్ కొనసాగింది.

పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపడతారు. సర్పంచ్ ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి సాయంత్రానికల్లా చాలా గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

ముగిసిన మూడో దశ పంచాయతీ పోలింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *