News5am, Telugu News Breaking (07-06-2025): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లోకి మారిపోయారు. ఈ పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుకు లేఖ రాసి, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ తాను టీడీపీకి గుడ్‌బై చెబుతున్నానని తెలిపారు.
ఇక, రాజంపేట టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పద్మ ప్రియ కళ్యాణ మండపంలో చెంగల రాయుడు వర్గీయులు సమావేశమై టీడీపీ అసెంబ్లీ ఇంఛార్జ్ పదవి చెంగల రాయుడికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు కార్యకర్తలు మోకాళ్ళపై కూర్చొని నినాదాలు కూడా చేశారు. వైసీపీకి చెందిన నేతలు టీడీపీలోకి వచ్చి కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
More Telugu News Today:
News Breaking:
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నిరసన..
More Telugu News Breaking: External Sources
రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..!