తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూంను తెరిచారు. ముందుగా బ్యాలెట్ పత్రాలను బండిల్ చేస్తారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అసలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు ఫలితాలు రావడానికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు లెక్కింపు జరుగుతోంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.