తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి తేదీ. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి, ఐదు సీట్లలో నాలుగు అధికార పార్టీకి, ఒకటి బీఆర్‌ఎస్‌కు వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన నాలుగు ఎమ్మెల్సీ సీట్లలో ఒకదాన్ని తన మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది.
నిన్న, కాంగ్రెస్ మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చింది. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.