నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో జరగనుంది. ఆర్‌ఓఆర్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదం పొందనున్నారు. ఈ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నారు.

మరోవైపు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే ఛాన్స్‌ ఉంది. వీటిపై శాసనసభో చర్చ నిర్వహించనుంది. ఇక యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ కమిషన్‌ సమర్పించిన విచారణ నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం పరిశీలించి శాసనసభో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ‘ఫార్ములా ఇ’ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *