తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అర్హత ఉండటంతో నిరుపేద కుటుంబాలకు పెద్ద ఆటంకంగా మారాయి. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయబోతున్నామని తెలిపారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డు జారీ మార్గదర్శకాలపై మంత్రివర్గంతో చర్చించనున్నారు. ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియపై చర్చించి మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డు రేషన్ కోసమని, ఆరోగ్యశ్రీ వైద్యం కోసమని అన్నారు. నిజానికి చాలా కాలంగా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు. దీంతోపాటు కార్డుల్లో చేర్పులు, మార్పుల ప్రక్రియ జరగలేదు. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *