హైదరాబాద్: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజ వనరులను కొల్లగొడుతూ ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ నేత పుట్ట మధు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇసుక మాఫియాను మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్నా అధికారులు మౌనంగా చూస్తున్నారు. ఒక లారీకి అనుమతి ఉండగా 100 లారీల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్లింది. ఓటుకు రెండు వేల రూపాయలుఇచ్ఛి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు.