నేడు మహిళల టీ20 ఆసియ కప్ సెమి ఫైనల్ పోరు సిద్ధమైంది. వరుస విజయాలతో విజయ బేరి మోగించుకుంటు వస్తున్న భారత్ ఈ మ్యాచ్ ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని లక్షంగా పెట్టుకుంది. ఈ క్రమంలో భారత్ , బంగ్లాదేశ్ తో మధ్యాహ్నం 2 గంటలకు రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత మహిళా జట్టు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో సెమి ఫైనల్ పోరుకి సిద్ధం అయింది. భారత మహిళా జట్టు ప్లేయర్లు ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన మరోసారి కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్ అయినా దీప్తి శర్మ, రాధా యాదవ్‌తో పాటు పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో పుంజుకుంటే ఇండియాకు ఇక తిరుగుండదు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వీక్షించవచ్చు.
