Babar Azam Reply: భారత్‌లో ఐపీఎల్ జరుగుతుండగా పాకిస్థాన్‌లో పీఎస్ఎల్ కూడా కొనసాగుతోంది. ఈ లీగ్ ఇప్పటికే కొన్ని వివాదాలకు కారణమైంది. తాజాగా బాబర్ ఆజం మరియు ఓ రిపోర్టర్ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ 37 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే కేవలం 146 పరుగుల లక్ష్యాన్ని కూడా జట్టు సులభంగా చేజ్ చేయలేకపోయింది. చివరికి జల్మీ జట్టు చివరి బంతికి గెలిచింది. మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్‌లో బాబర్‌కు అసౌకర్యమైన పరిస్థితి ఎదురైంది.
ఒక రిపోర్టర్ విరాట్ కోహ్లీతో పోల్చుతూ, “అతను మీలాగే ఆడినా మ్యాచ్‌లను ఫినిష్ చేస్తాడు, మీరు మాత్రం వెనుకబడి ఉన్నారు” అని ప్రశ్నించాడు. దీనికి బాబర్ అసహనంతో, “ఇలాంటి పోలికలు ఆపండి, నేను మ్యాచ్‌లను ఫినిష్ చేయలేనన్నది మీ అపోహ” అని గట్టిగా స్పందించాడు. వాస్తవానికి బాబర్ మంచి ఆటగాడే అయినా, టీ20ల్లో అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం, పెద్ద లక్ష్యాలను ఛేజ్ చేసే సమయంలో విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో అతను 2 మ్యాచ్‌లలో 82 పరుగులు చేసినా, 126.15 స్ట్రైక్ రేట్‌తో పాటు కేవలం 10 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండటం విమర్శలకు కారణమవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
“విరాట్ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్