News5am, Breaking News Updates Telugu (28-05-2025): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గొప్ప రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్ మొత్తం మీద ఒకే జట్టు తరపున 9,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో కోహ్లీ అర్థశతకం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 24 పరుగులు చేసిన సమయంలోనే ఈ ఘనతను సాధించాడు. ఈ రన్స్‌లో ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు కూడా ఉన్నాయి.
టీ20 ఫార్మాట్‌లో ఒకే జట్టు తరపున 9000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున 6060 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. హంప్‌షైర్ తరపున జేమ్స్ విన్స్ 5934 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేశ్ రైనా 5529 పరుగులు, ఎంఎస్ ధోనీ 5314 పరుగులు చేశారు. కోహ్లీ తన కెరీర్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ మొదట డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడి, తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్నాడు.
More Breaking Telugu News Sports:
Breaking News Updates Telugu
తొలి రౌండ్‌లో డి గుకేష్‌ను ఓడించిన మాగ్నస్ కార్ల్సెన్
More Breaking News Latest: External Sources
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!