Dhruv Jurel Tattoo

Dhruv Jurel Tattoo: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్ జురెల్‌ 171 బంతుల్లో 9 ఫోర్లతో రెండో టెస్టు సెంచరీ సాధించాడు. శతకం అనంతరం ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. తన తాత రైతు, తండ్రి సైన్యంలో పనిచేశారని, వారి జ్ఞాపకార్థమే ఆ టాటూ వేయించుకున్నానని తెలిపాడు. ఈ సెంచరీని తండ్రి, తాతకు అంకితం చేశానని చెప్పాడు. జురెల్‌ 115 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్‌ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

భారీ స్కోరుతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లాహిరు ఉదారా 1 పరుగు, ప్రభాత్ జయసూర్య 2 పరుగులకే ఔటయ్యారు. దీంతో లంక 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8/2గా ఉన్న శ్రీలంక.. మూడో రోజు రెండో సెషన్‌లో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!

నిఖత్ జరీన్‌కు స్వర్ణం..

External Links:

‘జై జవాన్‌.. జై కిసాన్‌’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *