Toxic Ticket Prices: యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో గరిష్ఠ టికెట్ ధరలు వరుసగా రూ.227, రూ.395 వరకు ఉండనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. నిర్మాణ సంస్థ రూ.1 కోటి విరాళం ఇవ్వడంతో పాటు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ప్రకటనలు థియేటర్లలో ప్రదర్శించాలి. నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
తెలంగాణలో యష్ టాక్సిక్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చిన కాసేపటికే..