Nagarjuna 100th Movie First Look: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో నాగార్జున వాయిస్ ఓవర్, ‘‘డబ్బు కంటే ఐడెంటిటీ పవర్‌ఫుల్. ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నేను పరిగెడుతూనే ఉండాలి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
గ్లింప్స్‌ను బట్టి నాగార్జున పాత్ర పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగి, తన గుర్తింపు కోసం పోరాడే కథగా సినిమా ఉండనుంది. చివర్లో ఓ చిన్నారిని ఎత్తుకుని నాగార్జున కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆమె పాత్రకు నాగార్జునతో ఉన్న సంబంధం ఏంటనేది సినిమాలో చూడాల్సిందే.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….